JSON Variables

పాఠశాల ఆవరణలో నర్సరీ తొలగించాలి

పాఠశాల ఆవరణలో నర్సరీ తొలగించాలి

 న్యూస్ పవర్, 23 నవంబర్ , ఇల్లంతకుంట :
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని గాలిపల్లి ఉన్నత పాటశాల మైదానంలో గత రెండు సంవత్సరాలుగా నర్సరీ నిర్వహిస్తున్నారు  నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల చుట్టూ గడ్డి పెరిగి పాములు సంచారిస్తున్నయి పలుమార్లు క్లాస్ రూమ్ లోకి కూడ వచ్చాయి  సాయంత్రం ఉదయం సమయంలో యువకులు వ్యాయామానికి వచ్చినపుడు కూడ పాములు దర్శనం ఇస్తున్నాయి కావున విద్యార్థులు పాఠశాలకు రావడానికి భయాందోళన చెందుతున్నారు దీనిపై గతంలో  విద్యార్థుల భయం చూడలేక పాఠశాలకు విద్యార్థుల తల్లితండ్రులు ఈతరం యువజన సంఘం సభ్యులు వెళ్ళి చూడగా నర్సరీ చుట్టూ ఉన్న గడ్డి లో పాములు ఉండగా జిల్లా కలెక్టర్  ఎంపిడిఓ  గ్రామ సెక్రెటరీ లకు నర్సరీ  తొలగించాలని వ్రాత పూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది గత గాలిపల్లి గ్రామ సభలో కూడ తొలగించడానికి తీర్మానం చేయడం జరిగింది ఎన్ని చేసినా కూడ అధికారులు ఇట్టి విషయాని పెడ చెవిన పెట్టడం ఎంత వరకు మంచిదో వారికే తెలియాలి గ్రామ ప్రజలు లేనిది మండల అధికారులు గ్రామ అధికారులు ఎక్కడి నుంచి వచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల భాధలు పట్టించుకోని వారి అభిప్రాయాలను తీసుకోని అధికారులు ఎందుకని విద్యార్థులు ఈ పాఠశాల మానేస్తామని విద్యార్థులు తెలిపారు  గత 20 రోజుల క్రితం బిసి హాస్టల్  లో జరిగిన పాము కాటు సంఘటన మర్చిపోయారా అధికారుల పిల్లలు మా గాలిపల్లి పాఠశాలలో  చదివితే వారికి పాములు కనబడితే తెలుస్తుంది  పాముల భాధ భయం  మళ్ళీ ఎదైన అవాంచనీయ సంఘటన జరిగితేనే మీకు చలనం వచ్చేలా వుంది నర్సరీ తొలగించని ఏడల తమ పిల్లలను పాఠశాలకు పంపమని తల్లి తండ్రులు అంటున్నారు ఇకనైనా విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని  గ్రామస్థుల అభిప్రాయా సూచనల మేరకు  తక్షణమే నర్సరీ పనులు నిలిపి వేయాలని గ్రామస్థులు ఈతరం యువజన సంఘం సభ్యులు విద్యార్థుల తల్లదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.

Post a Comment

0 Comments