రాజన్న సిరిసిల్ల జిల్లా, సఖి/వన్ స్టాప్ సెంటర్లో ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ Rajanna Sirisilla District, Sakhi/One Stop Center Vacancy Notification

రాజన్న సిరిసిల్ల జిల్లా, సఖి/వన్ స్టాప్ సెంటర్లో ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ Rajanna Sirisilla District, Sakhi/One Stop Center Vacancy Notification



రాజన్న సిరిసిల్ల జిల్లా, సఖి/వన్ స్టాప్ సెంటర్లో ఖాళీ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. ఖాళీల సంఖ్య, అర్హత మరియు నియామకం ప్రక్రియ వంటి వివరాలు దిగువ ఇవ్వబడినవి: దాఖలు చేసుకొనుటకు అభ్యర్థుల కొరకు అర్హతా ప్రమాణాలు: వరుసగా క్ర.సం ఉద్యోగం-నెలవారీ వేతనం- ఉద్యోగాల సంఖ్య-అర్హతాప్రమాణాలు: 

01-సెంటర్ అడ్మినిస్ట్రేటర్-

నెలకు రూ.35,000/--01- 
• లా/సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్స్/సైకాలజీలో మాస్టర్స్, ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్లో మహిళా సంబంధిత ఆవశ్యక విభాగాలలో కనీసం 5 సంవత్సరాలు పని చేసిన అనుభవం. 
• కౌన్సిలింగ్లో కనీసం 1 సంవత్సరం అనుభవం. 

02- కేస్ వర్కర్-నెలకు రూ.20,000/- - 02- 

• లా/సోషల్ వర్క్/సోషియాలజీ/సో షల్ సైన్స్/సైకాలజీలో బ్యాచిలర్. 
• ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/కార్యక్రమంలో మహిళాసంబంధిత ఆవశ్యక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు పని చేసిన అనుభవం. 

03- పారా లీగల్ పర్సనల్ లాయర్-నెలకు రూ.25,000/--01- 

• లాస్లో న్యాయపరమైన శిక్షణ లేదా పరిజ్ఞానంతో/లాలో డిగ్రీ. 
• ప్రభుత్వ లేదా ప్రభుత్వే తర ప్రాజెక్ట్/కార్యక్రమంలో మహిళాసంబంధిత ఆవశ్యక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు పని చేసిన అనుభవం. 
• లిటిగేషన్లో కనీసం 2 సంవత్సరాల అనుభవంతో ప్రాక్టీసింగ్ లాయర్. 

04- పారా మెడికల్ పర్సన ల్-నెలకు రూ.15,000/-- 01- 

• ఆరోగ్య రంగంలో బ్యాక్ గ్రౌండ్తో పారామెడిక్స్లో డిప్లొమా/ప్రొఫెషనల్ డిగ్రీ. 
• ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/కార్యక్రమంలో కనీసం 3 సంవత్సరాలు పని చేసిన అనుభవం. 

05-సైకో-సోషల్ కౌన్సిలర్- 

నెలకు రూ. 25,000/-
• సైకాలజీ/ సైకియాట్రి న్యూరోసైన్సెస్లో డిప్లొ మా/ప్రొఫెషనల్ డిగ్రీ. 
• ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/కార్యక్రమంలో కనీసం 3 సంవత్సరాలు పని చేసిన అనుభవం. 

06-కంప్యూటర్ నాలెడ్జితో ఆఫీస్ అసిస్టెంట్-

నెలకు రూ.20,000/- 
కంప్యూటర్స్/ఐటి వగైరాలో కనీస డిప్లొమాతో గ్రాడ్యుయేట్ 
• డేటా మేనేజ్మెంట్, ప్రాసెస్ డాక్యుమెంటేషన్ మరియు వెబ్బేస్డ్ రిపోర్టింగ్ ఫార్మేట్స్, వీడియో కాన్ఫరెన్సింగ్లో 3 సంవత్సరాల అనుభవం.

07- మల్టీపర్పస్ స్టాఫ్/కుక్ - నెలకు రూ.12,500/--03- 

• సంబంధిత విభాగంలో పరిజ్ఞానం/పని చేసిన అనుభవంతో అక్షరాస్యులు, హైస్కూల్ ఉత్తీర్ణత లేదా తత్సమానమునకు ప్రాధాన్యం. 

• 08- సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ నెలకు రూ.12,500/-- 03- 

• ప్రభుత్వ లేదా పేరొందిన దానిలో సెక్యూరిటీ సిబ్బందిగా కనీసం 2 సంవత్సరాలు పని చేసిన అనుభవం. 
• పదవీ విరమణ పొందిన మిలిటరీ/పారా మిలిటరీ సిబ్బంది అయినటువంటి అతనికి/ఆమెకు ప్రాధాన్యం ఇవ్వబ డుతుంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 13. సంబంధిత విద్యార్హతలు మరియు అనుభవం సర్టిఫికెట్ రుజువులతో 07.12.2024 - 16.12.2024 
05.00 గం.ల వరకు, రూమ్ నం. G-33, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (IDOC), రాజన్న రిసిల్ల జిల్లా వారికి దాఖలు చేయవలెను. ఈ ప్రకటనను రద్దు చేయుటకు లేదా ఖాళీల సంఖ్యలో మార్పులు వేయుటకు దిగువ సంతకందారుకు పూర్తి హక్కులు కలవు. కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, WCD & SC, రాజన్న సిరిసిల్ల వారి తరపున,

సం/- డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, రాజన్న సిరిసిల్ల జిల్లా

IPR Ro No.7597-PP/CL/ADVT/1/2024-25, ໖: 06.12.2024

Post a Comment

0 Comments