న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి లాబర్తి సంపర్క్ అభియాన్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గంగిపల్లి ఎంపీటీసీ రంగు భాస్కర చారి హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఇల్లంతకుంట మండలంలో 6500 మంది లబ్ధిదారులు ఉన్నారని వారిని కార్యకర్తలు అందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖను అందించవలసిందిగా సూచించారు ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజాహితాయాత్ర మార్చి 5న ఇల్లంతకుంట మండలంలో జరుగుతుందని ఇట్టి కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు సూదుల కిషన్ మండల ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి చెప్పాలా గంగాధర్ మండల ఉపాధ్యక్షుడు భూమళ్ళ అనిల్ కుమార్ పెంటల వేణు గుగ్గిళ్ళ ఆంజనేయులు , బీజేవైఎం మండల అధ్యక్షుడు వజ్జేపల్లి శ్రీకాంత్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతలపల్లి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకుడు మేకల మల్లేశం దుద్దెడ రాజు గౌడ్ దేశెట్టి శ్రీనివాస్ రంగు రమేష్ నాయకుడు పున్ని సంపత్ కుడుముల శ్రీహరి తిరుపతి దాసరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.