JSON Variables

వాణీనికేతన్ హైస్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు

వాణీనికేతన్ హైస్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు

న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి, ఇల్లంతకుంట 
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబీట్లను ప్రదర్శించారు. ఈసందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు ప్రఖ్యాత బౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ సిద్దాంతాన్ని కనుగొన్నాడని తెలిపారు. అందువల్లనే ప్రతి సంవత్సరం ఇదే రోజును సైన్స్ దినంగా జరురుకుంటున్నామన్నారు.ప్రతివ్యక్తి జీవితం సైన్స్ తో ముడిపడి ఉందని, విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. సైన్స్ చదవిన విద్యార్థుల భవిష్యత్తు బాగుంటందని పేర్కొన్నారు. ఉత్తమ ఎగ్జిబీట్లకు  బహుమతులు అందించారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments