JSON Variables

_గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ కోరారు.._



_కూరేళ్ళ పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈరోజున ప్రధానమంత్రి గ్రామీణ ఉజ్వల పథకం ద్వారా ఇంట్లో ఉన్న ఎర్రబుగ్గలు కాలినవి తీసుకొచ్చి ఇచ్చేవారికి 50/-రూ"లకు అవేవి లేకుంటే 100/-రూ"లకు ఒక్కో కరెంటు బిల్లు చిట్టికి 5 LED 12 వాట్స్ బల్బులు 3,సంవత్సరాల వారంటితో అందిస్తున్న పథకం స్థానిక సర్పంచ్ గాజుల రమేష్ గారు ప్రారంభించారు_

_ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అందించే ఈ పథకాన్ని  గ్రామ ప్రజలు ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే పర్యావరణ న్నీ దృష్టిలో ఉంచుకొని ఎర్రబుగ్గలు_ _వాడకూడదని ఎర్రబుగ్గల వలన ఇటు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చి నష్టం జరుగుతుందని అలాగే పర్యావరణ నికి నష్టం చేకూరుతుంది అని అన్ని విధాలుగా కాలుష్యం వలన_ _నష్టపోతామని కాలుష్య  నిర్ములనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని అన్నారు ప్రభుత్వం సూచించే విదంగా మెదులుకుంటే అన్ని విధాలుగా మనకు మనం   కపడుకున్నవాళ్ళము_ _అవుతాము అని అన్నారు అలాగే పర్యావరణన్నీ కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని పర్యావరణ న్నీ  కాపాడుకోవాలని_ _సూచించారు అందుకు ప్రతి ఒక్కరు LED బల్బులు తీసుకోవాలని కోరారు  ._

 _ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారితో  ఉజ్వల పథకం నిర్వహకులు తుమ్మ నాగరాజు ఉప సర్పంచ్ నముకు ధర్మయ్య వార్డు సభ్యులు గాజుల  రవీందర్_ _పొన్నాల రవీందర్ జాగిరి రమేష్ దొంతుల భూపతి జాగిరి ప్రశాంత్ మల్లయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు_

Post a Comment

0 Comments