JSON Variables

బి.సి. సబ్సీడి రుణాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి- కాంగ్రెస్ పార్టీ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్




  
ఈ రోజు హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలో విలేకరులతో కాంగ్రెస్ పార్టీ నియెాజక వర్గ యువ నేత    బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ 
మాట్లాడుతూ 
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రతి సంవత్సరం బి.సి.రుణాలు విడుదల చెసింది కాని 
ఇప్పడున్న టి.ఆర్.ఎస్ ప్రభుత్వం మాత్రం గత ఎనిమిది సంవత్సరాలలో  2018 లో ఒకే ఒక్కసారి బిసి రుణాలు మంజూరు చేసింది తర్వాత  ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు 
గొర్రెలు బర్రెలు ఎరగా వేసి మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం నిజంగానే  బీసీలకు చేసిందేమీ లేదు అన్నారు 
ఈ ప్రభుత్వం 
మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృష్ణా రెడ్డి గారికి ఒక లక్షా 40 వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చి కనీసం బీసీలకు ఏ ఒక్క రూపాయి కూడా బి.సి.రుణాలు మంజూరు  చేయకపోవడం ఎంతవరకు సమంజసం.  
కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం మరియు   రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకి  గ్యారెంటీ ఇవ్వకపోవడం వీళ్లిద్దరి మధ్య లో బీసీలు నష్టపోవడం జరుగుతుందిన్నారు 
 
బీసీలకు రావాల్సిన 25 నుండి 30 శాతం సబ్సిడీ ఎక్కడికి పోతుంది ఎన్నికల సమీపిస్తేనే  బీసీలు గుర్తొస్తారా? 
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బి.సి.రుణాలు విడుదల చెయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు బి.సి.సంక్షేమ సంఘం  పక్షాన డిమాండ్ చెస్తున్నాను అన్నారు

Post a Comment

0 Comments