JSON Variables

ప్రభుత్వం ధరణిని సరి అయిన చేయాలి లేదా ఎత్తెయాలి ~~కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్



ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలో విలెకరులతో కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 
దేశంలో ఎవరు తీసుకురానన్ని సంస్కరణలు నేను తీసుకు వస్తాను అని భూప్రక్షలన తీసుకువచ్చారు కెసిఆర్. 
దీనిలో కబ్జా కాలం తీసివేసి ఇన్నాళ్లు సాగు చేసుకుంటున్న పేద రైతుల కళ్ళల్లో కెసిఆర్ మట్టి కొట్టారు. 
15 లక్షల ఎకరాలు పార్ట్ బి లో చేర్చి అమ్మకాలు, కొనుగోళ్ల లేకుండా చేశారు. 
గ్రామాల్లో ఒక్క గజం భూమికోసం అన్నదమ్ములు రక్తం కళ్ళ చూసుకుంటారు. అలాంటిది వేల ఎకరాలు ఇబ్బందుల్లో పెట్టారు కెసిఆర్. 
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఉడిపోయినట్టు ధరణి పోర్టల్ ఉంది. 
ధరణిలో చాలా  సర్వేనెంబర్స్ మాయం అయ్యాయి. 
అటు సవ్యమైన లిస్ట్లో ఆ భూములు లేవు, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఆ భూములు లేవు. 

రైతులు అయోమయంలో కొట్టుకుంటున్నారు. 
కోట్లు విలువ చేసే  భూములు  దాదాపు లక్ష ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చారు. 
ఆపద సమయంలో కూడా సొంత భూమిని అమ్ముకొలేక పోతున్నారు. 
మిలటరీ వారు, స్వాతంత్ర సమరయోధుల భూములు నిషేధిత జాబితా లో పెట్టారు 
ఒక సర్వే నంబర్ లో ఒక గుంట భూమి వివాదం ఉన్నా మొత్తం సర్వే నంబర్ ను నిషేధిత జాబితాలో చేర్చారు. 
ఒకే పేరుతో ఉన్న వారి భూములు ఒకరిది, మరొకరి పేరు మీద ఎక్కించారు. 
ఇవ్వన్నీ మార్చడానికి ఎవరికీ అధికారం లేదు. 
60 వేల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. 
పట్టించుకొనే దిక్కే లేదు. 

ధరణి చిక్కులను తొలగించడానికి నిష్ణాతులతో కమిటీ వేసి  ఒక నిర్ణయం తీసుకోవాలి.
లేనిచో ధరణి ని మొత్తానికి ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మరియు బి.సి.సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చెస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో రవి, రాజు, అనిల్ తదితరులు పాల్గోన్నారు

Post a Comment

0 Comments