Skip to main content

కేసీఆర్‌కు ఊహించని షాకిచ్చిన కేంద్రం.. ఇకపై రూల్స్ చేంజ్

కేసీఆర్‌కు ఊహించని షాకిచ్చిన కేంద్రం.. ఇకపై రూల్స్ చేంజ్

కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్రం పెత్తనానికి కత్తెర వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం కేటాయించే నిధులను వాడుకుని, కనీసం అక్కడ కేంద్ర నిధులు, ప్రధాని, సంబంధిత మంత్రి ఫొటో కూడా పెట్టకపోవడంపై ఇప్పటికే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, వైకుంఠధామాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, పంట కళ్లాల నిర్మాణంలో ఉపాధి హామీ నిధులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ, అవన్నీ రాష్ట్రం సొంత ఖాతాలో వేసుకుంటోంది. ఇది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతోంది. దీంతో ఈ విధానానికి బ్రేక్​ వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి రాష్ట్ర ప్రమేయం లేకుండా.. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు నేరుగా సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. దీంతో ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే పనులకు కేంద్రం నిధులను వాడుకునే అవకాశం ఉండదు.

రూల్స్ చేంజ్..​
ఉపాధి హామీలో ప్రస్తుతం 60:40 రేషియోలో పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక సీసీ రోడ్డును ఉపాధి హామీ కింద నిర్మాణం చేస్తే దానిలో 60 శాతం కూలీలకు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా.. 40 శాతం మెటీరియల్​కాంపోనెంట్​కోసం వినియోగించుకోవచ్చు. అయితే, వీటికి సంబంధించిన నిధులను ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చేవారు. రాష్ట్రం ఈ నిధులను ఎంతో కొంత ఇతర పనులకు డైవర్ట్​ చేసుకుని, వీలును బట్టి కూలీలకు, సంబంధిత పనులు చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. కేంద్రం నుంచి కూలీలకు 15 రోజుల వ్యవధిలోనే వేతనాలు విడుదలైనప్పటికీ.. వాటిని రాష్ట్రం వాడుకోవడంతో నెలల తరబడి కూలీలకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. వాస్తవానికి దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేంద్రం నుంచే నేరుగా ఎన్ఐసీ పోర్టల్​ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటి వరకు మన రాష్ట్రానికి మాత్రం మినహాయింపు ఉంది. ఈ నెల 17 నుంచి ఇక్కడ కూడా అదే విధానం అమల్లోకి రానుంది.

హుజురాబాద్​ ఎఫెక్ట్..​
ఉపాధి నిధుల వినియోగంలో కేంద్రం నిబంధనలు మార్చడంలో హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా కీలకమేనని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతేడు హుజురాబాద్​ బై ఎలక్షన్​ సందర్భంగా ఇబ్బడిముబ్బడిగా సీసీ రోడ్లు మంజూరు చేశారు. వీటిలో 90 శాతం సీసీ రోడ్లు ఉపాధి హామీ నిధులవే. అంతేకాకుండా ఈ పనులు చేసిన కూలీలకు రూ. 40 కోట్లు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నుంచి ఈ నిధులు గతేడాది నవంబర్‌లోనే విడుదలయ్యాయి. కానీ, ఇప్పటికీ ఇంకా వాటిని కూలీలకు చెల్లించలేదు. అంతేకాకుండా ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర నిధుల ప్రస్తావనే లేదు. ఈ నేపథ్యంలో నిబంధనల మార్పునకు ఇది కూడా ప్రధాన కారణమని అధికారులు చెప్పుతున్నారు.కేంద్రం నిధులు.. రాష్ట్రం పేరుమరోవైపు ఉపాధి హామీ నిధుల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక విధానాలను అమల్లోకి తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత సీసీ రోడ్లను మినహాయిస్తే.. వైకుంఠధామాలు, పంట కళ్లాలు, హరితహారం, రైతు వేదికలు, డంపింగ్​ యార్డులు, పల్లె ప్రకృతివనాలకు ఉపాధి నిధులు ప్రత్యేకంగా ఇచ్చే వెసులుబాటు లేదు. కూలీలకు పని కల్పించే కారణాన్ని చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నీ చేపట్టింది. అయితే, వీటికి సేకరించే నిధులను మాత్రం కేంద్రం నుంచి తీసుకుంటోంది. ఈ లెక్కన నిధులను డైవర్ట్​ చేస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది. ఇక నుంచి ఈ పనులు ఉపాధి హామీలో చేయాలంటే సెంట్రల్​ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటోంది.అంతేకాకుండా కేంద్ర నిధుల వినియోగంలో నిబంధనల ప్రకారం ప్రతీ పని దగ్గర సెంట్రల్​షేర్, ప్రధాని, సంబంధిత మంత్రిత్వ శాఖ వివరాలు, వినియోగించిన నిధులను తేటతెల్లం చేయాలి. దీంతో ఇక నుంచి ఉపాధి నిధులను వాడుకునే వెసులుబాటు రాష్ట్రానికి తగ్గిపోనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సాఫ్ట్​వేర్‌ను కేంద్రం అప్​డేట్​చేస్తోంది. ఇప్పటికే దీనిపై ఉపాధి హామీ విభాగంలోని అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 17 నుంచి రాష్ట్రం పెత్తనాన్ని తగ్గిస్తూ చేపట్టిన పనికి కేంద్రం నుంచే నేరుగా బిల్లులు చెల్లింపులు జరుగనున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!

  రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం! రాజన్న సిరిసిల్ల: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐస్‌బాక్స్‌తో కూడిన మోటార్ సైకిళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేపల విక్రయానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాకు కేటాయించిన యూనిట్ల వివరాలు: తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 500 యూనిట్లు మంజూరు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 13 యూనిట్లు కేటాయించబడ్డాయి. వీటి విభజన ఈ క్రింది విధంగా ఉంది: సాధారణ వర్గం (General): 08 యూనిట్లు మహిళలు: 02 యూనిట్లు షెడ్యూల్డ్ కులాలు (SC): 02 యూనిట్లు షెడ్యూల్డ్ తెగలు (ST): 01 యూనిట్ మొత్తం: 13 యూనిట్లు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అర్హత కలిగిన మత్స్యకారులు తమ దరఖాస్తులను పూర్తి పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ (DLC) ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు గడువు: మార్చి 16, 2...