ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ న్యూస్ పవర్:- ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో 73వ గణతంత్ర_దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం కు పూల మాలలువేసి జెండా ఎగరేసిన. గ్రామ సర్పంచ్ చాకలి రమేష్.. పంచాయతీ కార్యదర్శి సాయి.మరియు స్కూల్ హెచ్చమ్ స్వర్ణ లత. మేడం. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కోలాపురం రాజు. ఉపాధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్ మరియు పాల కేంద్రం చేర్మెన్ అశోక్ రావు మరియు స్కూల్ సిబ్బంది ముంజుల మేడం. స్వప్న మేడం.మరియు స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్.అంబేద్కర్ సంఘం నాయకులు పుల్లూరి సంతోష్ తాటాకర్ల కిషన్ చాకలి బాబు. చాకలి రమేష్ వంగూరి గోపి గ్రామ పంచాయతీ పాలకవర్గం.. యూవత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...
Comments
Post a Comment