బొల్లం సాయిరెడ్డి. మండల్ రిపోర్టార్.న్యూస్ పవర్. జనవరి.15/22: రాజన్న సిరిసిల్ల జిల్లా TWF నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్ ప్రధాన కార్యదర్శి మహేందర్ ఉపాధ్యక్షుడు మల్లేష్ మరియు జిల్లా అధ్యక్షుడు శెట్టిపల్లి నరేష్ ఉపాధ్యక్షుడు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి సత్యం రెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు, వార్డు సభ్యులు శివ నగర్ లోని శివాలయంలో శివుని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని ఆ తర్వాత సభ నిర్వహించడం జరిగింది. అక్కడికి వచ్చిన ప్రతి వార్డు మెంబర్లు వాళ్ల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దీని గురించి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీలు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...
Comments
Post a Comment