JSON Variables

కుల బహిష్కరణ వ్యక్తి తో మాట్లాడినందుకు 10 వేల రూపాయలు జరిమానా?



బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్. న్యూస్ పవర్ . జనవరి.06/22:రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి?*....ముస్తాబాద్ మండలం  కొండాపూర్ గ్రామానికి చెందిన తాటిపల్లి పద్మారెడ్డి కి మరియు అతడి కొడుకు శ్రీనివాస్ రెడ్డి కి మధ్య ఆస్తితగాదాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అక్కడి సంఘ సభ్యులు అప్పట్లో పంచాయతీ నిర్వహించారు. చివరకు ఎటు తేలకపోయింది. దీంతో  తాటిపల్లి  పద్మారెడ్డితో ఎవరు కులసంఘ సభ్యులు మాట్లాడకూడదని సంఘ సభ్యులు తీర్మానం చేసుకున్నట్లు తెలిసింది.అతడికి ప్రతి నిత్యం పాలు పొసే వారు కూడా పాలు పోయలేదని,తెలిసింది.తనను కుల బహిష్కరణ చేశారని పద్మా రెడ్డి  పోలీసులను ఆశ్రయించారు. చివరకు తండ్రి కొడుకుల మధ్య గల ఆస్తితగాదాలు పెద్దమనుషుల సమక్షంలో ఒక కొలిక్కి వచ్చాయి.అయిన పద్మారెడ్డి తో ఎవరు మాట్లాడడం లేదు.కులసంఘము లో కలుపుకోలేరు.కాగా నిన్న అట్టి సంఘ సమావేశం కాగా తాటిపల్లి పద్మారెడ్డి తో ఎవరు మాట్లాడకూడదని చెప్పినాము కదా ఎందుకు మాట్లాడినారు అని అట్టి సంఘం లో ఉన్న  కుంబాల రాజిరెడ్డికి 10 వేల రూపాయలు జరిమానా విధించారు.అట్టి డబ్బులు సదరు సంఘానికి రాజిరెడ్డి చెల్లించాడని తెలిసింది.అదే విదంగా పద్మారెడ్డి సమీప బంధువు తాటిపల్లి శంకర్ రెడ్డి కి సైతం 10 వేల రూపాయల జరిమాన విధించగా అట్టి డబ్బులు శంకర్ రెడ్డి చెల్లించనట్టు తెలిసింది.ఇట్టి సంఘటన సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేకెత్తిస్తోంది .దీని పై పోలీసులు ఏ విదంగా స్పందిస్తారో చూడాలి మరి.

Post a Comment

0 Comments