ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
న్యూస్ పవర్ , 5 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల ఆవరణలో శనివారం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలను వేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే రూపొందుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను గౌరవించడం సామాజిక బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి, సుమంగళి, శోభ, మహాలక్ష్మి, సునంద, మౌనిక, కళ్యాణి, శమీమా, రేణుక, జలజ, శాంత, పద్మ, రేణుక, స్వాతి, సునీత, ఉష, లావణ్య తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు
Comments
Post a Comment