Skip to main content

వాణినికేతన్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

 వాణినికేతన్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఇల్లంతకుంట వాణినికేతన్ హైస్కూల్ రక్షాబంధన్ వేడుకల్లో అధికారులకు రాఖీ కడుతున్న విద్యార్థినులు


న్యూస్ పవర్, 27 ఆగస్టు, ఇల్లంతకుంట:

మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్‌లో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ప్రజాప్రతినిధులు, అధికారులకు రాఖీలు కట్టారు.

ఫ్యాక్స్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, తహసీల్దార్ రాచకట్ల సురేష్, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మామిడి రాజుతో పాటు పాలకవర్గ సభ్యులకు, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఉపేంద్ర చారితో పాటు పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టారు. అలాగే ముస్కాన్‌పేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, సహకార బ్యాంక్ మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులకు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని పేర్కొంటూ విద్యార్థులకు రక్షాబంధన్ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు రేణుక, సుమంగళి, శోభ, కళ్యాణి, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, జలజ, శాంత, పద్మ, సునీత, స్వాతి, ఉషారాణి, శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, తిరుపతిలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!

  రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం! రాజన్న సిరిసిల్ల: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐస్‌బాక్స్‌తో కూడిన మోటార్ సైకిళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేపల విక్రయానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాకు కేటాయించిన యూనిట్ల వివరాలు: తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 500 యూనిట్లు మంజూరు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 13 యూనిట్లు కేటాయించబడ్డాయి. వీటి విభజన ఈ క్రింది విధంగా ఉంది: సాధారణ వర్గం (General): 08 యూనిట్లు మహిళలు: 02 యూనిట్లు షెడ్యూల్డ్ కులాలు (SC): 02 యూనిట్లు షెడ్యూల్డ్ తెగలు (ST): 01 యూనిట్ మొత్తం: 13 యూనిట్లు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అర్హత కలిగిన మత్స్యకారులు తమ దరఖాస్తులను పూర్తి పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ (DLC) ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు గడువు: మార్చి 16, 2...