ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షబందన్ వేడుకలు
న్యూస్ పవర్ , 27 ఆగస్టు , ఇల్లంతకుంట:ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండలం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మరియు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వక్తగా అక్కేం నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రక్షాబంధన్ వేడుకలు నిర్వహిస్తాం అని విద్యార్థుల్లో సోదర భావం, సామాజిక సమరసత ,జాతీయత, స్వదేశీ భావన,ఆధ్యాత్మిక చింతన మరియు క్రమశిక్షణ పెంపోదించడం మరియు దేశభక్తిని నింపడం, ప్రతి విద్యార్ధి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని సమాజంలో జరుగుతున్న అసంఘీక శక్తులను ఎదురుకోవాలి అని, ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి మరియు మంచిని చేరదియాలి అని చెడుకు దూరంగా ఉండాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు , మంద వంశీకృష్ణ బొల్లం ప్రశాంత్ మల్యాల పర్శరాములు మరియు ఆయా పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Comments
Post a Comment