సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర
న్యూస్ పవర్, 13 ఆగస్ట్, ఇల్లంతకుంట:
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మంద అనిల్ కుమార్, సావనపెల్లి మల్లేశం ఆధ్వర్యంలో పొత్తూర్ బ్రిడ్జ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంద సుదర్శన్ మాట్లాడుతూ... ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం పాదయాత్రలకు సిపిఐ పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రలు 2026 సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగబోయే "బద్లావ్ జరూరీ హై" ( మార్పు అత్యవసరం) ర్యాలీలతో ముగుస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఈ పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి. సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి. అలాగే పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలి. ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి. మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలి అన్నారు. బ్యాలెట్ పేపరు పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అలాగే దళిత ఆదివాసీలపై దాడులను నిలిపివేయాలి. మహిళలలకు రక్షణ కల్పించాలి. నేడు భారతదేశంలో ఒక కీలకమైన మలుపులో నిలిచి ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ దశబ్దం క్రమంగా ఆందోళన నిరషా మరియు పెరుగుతున్న కష్టాలకు దారి తీసింది ఎన్నికల సందర్భంగా బిజెపి అభివృద్ధి ఉపాధి సంక్షేమం సుపరిపాలన మరియు మెరుగైన భవిష్యత్తును అందిస్తామని వాగ్దానం చేసింది కానీ దానికి బదులుగా దేశంలో నేడు పెరుగుతున్న నిరుద్యోగం భరించలేనీ ద్రవ్యోల్బణం ధరల పరుగుదల విస్తరిస్తున్న అసమానతలు బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతున్న ప్రజాస్వామ్యం మరియు ప్రభుత్వం సామాజిక లను ఉద్రిక్తలను ఏరుకుంటుంది అయినాప్పటికీ మోదీ ప్రభుత్వం నుండి ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలని కోరినప్పుడల్లా ఈ చర్చను ఇతర అంశాల వైపునకు మళ్లిస్తున్నారు సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నారు మత విద్వేషాలతో యువతను ప్రజలను పక్కదారి పట్టిస్తూ కాలం గడుపుతున్న పరిస్థితి ఉందన్నారు. మొన్నటికి మొన్న నీటి పరీక్ష పేపర్ లింకుతో దేశమంతటా విద్యార్థులు ఆందోళనలతో జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అలుపెరుగని పోరాటాలు చేస్తున్న విద్యార్థులపై దాడులు నాటి చార్జీలతో భయభ్రాంతులకు గురిచేసిన ప్రభుత్వానికి భవిష్యత్తులో తగిన గుణపాఠం ఈ దేశ ప్రజలు మహిళలు యువత విద్యార్థులు బుద్ధి చెప్తారని తెలియజేశారు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చడం కొరకు మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా రాని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశ ప్రజలకు అన్యాయం చేస్తే వామపక్ష పార్టీలుగా పోరాటంలో ముందుండి కొట్లాటకు సిద్ధపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు భూంపెల్లి భూమిరెడ్డి, కాదురు మొండయ్య, పెండెల అధిత్య, గుంటి బక్కయ్య, గుంటి తిరుపతి, రాజయ్య, దొమ్మరి కనకయ్య, కోల వెంకటయ్య, గొట్లముక్కుల రాజయ్య, చిగుర్ల అనీల్, తోట్ల రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment