బీటి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపిపి
న్యూస్ పవర్ , 1 నవంబర్ , ఇల్లంతకుంట :
టిఆర్ఎస్ పాలనలోనే రోడ్లకు మహార్దశ వచ్చిందని, రహదారులను సుందరంగా మార్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం రూ .2కొట్ల 90 లక్షల నిధులను మంజూరు చేసిందని ఎంపిపి వుట్కురి వెంకట రమణా రెడ్డి అన్నారు, మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు బీటి రోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు, ముస్కువానిపల్లే నుండి ఓగులాపూర్ వరకు 6 కిలోమిటర్లు రూ. 1.40 లక్షలు, ముస్కువానిపల్లే నుండి కందికట్కూర్ వరకు 3 కిలోమిటర్లు రూ.60 లక్షలు ఏం అర్ అర్ నిధుల ద్వారా రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు, అదేవిధంగా తాళ్లపెల్లి నుండి గూడెం వరకు 1.7 కిలోమిటర్లు రూ. 95 లక్షల నిధులు సి అర్ అర్ ద్వారా మంజూరైనట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు మెరుగైన రహదారులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు, త్వరలోనే మిగితా రహదారులను ఎమ్మెల్యే చోరవతో బాగుచేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ మామిడి సంజీవ్, వైస్ ఎంపిపి సుధగోని శ్రీనాథ్ గౌడ్, మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య, సర్పంచులు ముత్యం అమర్, గట్లా మల్లారెడ్డి, వాణీ దేవేందర్ రెడ్డి,ముస్కుమల్లయ్య, ఎలుక పద్మకనుకయ్య, ఎంపిటిసిలు దోమ్మాటి కిషోర్ గౌడ్, సింగిరెడ్డిశ్యామలదేవి సుధాకర్ రెడ్డి, నాయిని స్రవంతి రమేష్, ముత్యం రెడ్డి, సావనపెల్లి వనజఅనిల్, నాయకులు ముక్కీస కేశవరెడ్డి , యాస తిరుపతి, తూచి పర్శరాం, విజయ్, ఏఈ అజారుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments