డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేయాలి
న్యూస్ పవర్, 21 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) జిల్లా కన్వీనర్ సావనపెల్లి రాకేష్ ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఈమాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ర40 డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి 22 నెలలు అయినా ప్రజలకు ఇళ్లు పంపిణీ చేయకపోవడం నిరాశ కలిగించే విషయమని ఆయన తెలిపారు. గ్రామ సభలో పారదర్శకంగా ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఇప్పటికీ అద్దె ఇళ్లలో కష్టాలు పడుతున్నారని వివరించారు.
వెంటనే ఈ ఇళ్లను దసరా కానుకగా పంపిణీ చేసి నిరుపేద కుటుంబాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి" అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మండల యువజన సంఘాల JAC అధ్యక్షుడు మామిడి విజయ్, బహుజన ఉద్యమకారులు ఏనుగుల లింగన్న, దాసరి రవి తదితరులు పాల్గొన్నారు.
