జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే పండుగ సాయన్నల విగ్రహాల ఆవిష్కరణ
న్యూస్ పవర్ , 21 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
పెద్దలింగపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే మరియు పండుగ సాయన్నల విగ్రహాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు మరియు గ్రామ ప్రజలు హాజరయ్యారు
ఈ కార్యక్రమానికి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎలవేని రమేష్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అంబర్ పేట శంకర్, బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము రమేష్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు పాల్గొన్నారు
స్థానిక నాయకులు, తాజా మాజీ సర్పంచ్ గొడిశేల జితేందర్ గౌడ్, మాజీ ఎంపిటిసి కరివేద స్వప్న కరుణాకర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
