వీధి దీపాలు లేక, చితి మంటల వెలుగులో బతుకమ్మ నిమజ్జనం
• ఇల్లంతకుంట మండలం, కందికట్కూరు గ్రామ మహిళల తీవ్ర ఆవేదన
న్యూస్ పవర్, 21 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ నిమజ్జనం చీకటిమయంగా మారింది . బతుకమ్మ నిమజ్జనం చేసే వాగు వద్ద వీధి దీపాలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు చీకట్లో బతుకమ్మ నిమజ్జనం చేయాల్సి రావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మహిళలు ఆరోపించారు,
గ్రామంలో ఒకరు మరణించడంతో, కాలుతున్న చితి మంట వెలుగులో బతుకమ్మలను వాగు వద్దకు తీసుకెళ్లడం చాలా బాధాకరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు . లైటింగ్ సౌకర్యం లేకుండా వాగు వద్దకు వెళ్లడం అత్యంత కష్టంగా మారిందని మహిళలు పేర్కొన్నారు . గతంలో ఇదే మిడ్ మానేరు వాగులో పలువురు గల్లంతయ్యారని, ఇప్పుడు కూడా ఇలాంటి అజాగ్రత్త ప్రమాదకరమని వారు గుర్తు చేశారు ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ మహిళలు డిమాండ్ చేశారు .
