అక్రమంగా ఇసుక రవాణా చేస్తే జైలుకే
న్యూస్ పవర్,21 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామం శివారులోని బిక్క వాగు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టించి సీజ్ చేశారు. ట్రాక్టర్ ఓనర్ ముద్దల అజయ్ మరియు ట్రాక్టర్ డ్రైవర్ దాసరి సిద్ధార్థ పై ఇల్లంతకుంట ఎస్సై లక్పతిలు కేసు నమోదు చేసి, వారిని జ్యూడిషియల్ కస్టడీ కోసం రిమాండ్కు తరలించారు.
అక్రమ ఇసుక రవాణా పై కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఎస్సై తెలిపారు .
