సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు లేవు అంటే మహిళ లోకాన్ని అవమానించడమే : సిద్ధం వేణు
న్యూస్ పవర్, 21 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట, రాజన్న సిరిసిల్ల జిల్లా
సద్దుల బతుకమ్మ పండుగకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం మహిళ లోకాన్ని అవమానించడమే అవుతుందని మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు అన్నారు
ఇల్లంతకుంట మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణలో మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ అని, ప్రపంచంలో పూలను పూజించే ఏకైక ప్రాంతం తెలంగాణ అని తెలిపారు.
-ఇలాంటి పండుగకు కనీస ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.
గ్రామాల్లో విద్యుత్ దీపాలు వెలగకపోవడం, శుభ్రపరిచే పనులు జరగకపోవడంతో పల్లెలు కళ తప్పిపోతున్నాయని వ్యాఖ్యానించారు.
పంచాయతీ కార్యదర్శులు లక్షల్లో అప్పులు చేసి పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, పారిశుధ్య కార్మికులు మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
కనీసం సద్దుల బతుకమ్మకు ముందే పెండింగ్ బిల్లులు విడుదల చేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సావనపల్లి వనజ - అనిల్ కుమార్, మీసరగొడ్ల అనిల్ కుమార్, బిఆర్ఎస్ ఇల్లంతకుంట పట్టణ అధ్యక్షుడు కూనబోయిన రఘు, పెద్దలింగపూర్ మాజీ ఉపసర్పంచ్ కుమార్, భాగయ్య, కేశవేణి శ్రీనివాస్, బర్ల రమేష్, గుంటి మధు తదితరులు పాల్గొన్నారు.
