వాణీనికేతన్ హైస్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
న్యూస్ పవర్ , 14 ఆగస్ట్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణీనికేతన్ హై స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలు వేసి కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులు గోపికలు, కృష్ణుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి, సుమంగళి, శోభ, రేఖ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, జలజ, స్వాతి, శాంత, పద్మ, రేణుక, సునీత, రేణుక, షమీమాలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు<
.
