రాయితీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు
న్యూస్ పవర్, 17 ఆగస్ట్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని రైతులు వ్యవసాయ పనిముట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి M.సురేష్ రెడ్డి తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను ఐదు ఎకరాల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50శాతం రాయితీ, ఇతర రైతులకు 40శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్, రోటవేటర్, కల్టివేటర్, బ్రష్ కట్టర్, సీడ్కం పర్టిలైజర్ డ్రిల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కోన్నారు. రాయితీ పొందడానికి అర్హతగల రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్, మట్టి నమూనా పరీక్షలు చేసుకుని ఉండాలని తెలిపారు. రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, పాస్ బుక్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు దరఖాస్తుకు జతచేసి ఈ నెల 23వ తేదీలోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు ఆందజేయాలని సూచించారు.
