వెంకట్రావుపల్లి గ్రామంలో కేసీఆర్ కిట్ల పంపిణీ
న్యూస్ పవర్, 17 ఆగస్ట్, ఇల్లంతకుంట:
మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో తల్లీబిడ్డలకు కేసీఆర్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్ మాట్లాడుతూ, కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ఐదు వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.
కేసీఆర్ కిట్ల వల్ల మాతాశిశు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే వాటిని నిలిపివేసిందని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తోటపెల్లి తిరుపతి, జెట్టి నాగరాజు, ఐరెడ్డి అఖిల్ రెడ్డి, జెట్టి నవీన్, పోరెడ్డి హరికాంత్ రెడ్డి, నర్సింగోజు శ్రవణ్, యాగండ్ల ప్రశాంత్, ఎండ్రా వెంకటేష్, రామగిరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
