పల్లె దవాఖానాకు దారి లేక ప్రజలు ఇబ్బందులు
• నాగసముద్రాల సంతోష్, మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు
న్యూస్ పవర్, 14 ఆగస్ట్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పల్లె దవాఖానాకు వెళ్లే మార్గం లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ బిజెపి మండల అధ్యక్షుడు నాగ సముద్రాల సంతోష్ ఆరోపించారు
అత్యవసర వైద్య సేవలు పొందడంలో రోగులు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర కష్టాలను అనుభవిస్తున్నారనీ ముఖ్యంగా వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రమై, రోగులను తరలించడం దాదాపు అసాధ్యమవుతోందన్నారు రోజూ వందలాది మంది వైద్య సేవల కోసం వస్తున్నా, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళన ప్రజల్లో నెలకొందనీ
గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడే పల్లె దవాఖానాకు దారి సమస్యపై సంబంధిత అధికారులు సంబంధించి మరమ్మత్తు పనులు చేపట్టి సులభమైన రహదారి ఏర్పాటు చేయాలని శాశ్వతంగా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరాడు.
