రేపాకలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు
న్యూస్ పవర్ , 7 ఆగస్ట్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని ఎస్సి అంగన్ వాడి కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక అంగన్ వాడి టీచర్ మీసాల హంసలీల మాట్లాడుతూ బిడ్డకు తల్లి పాలు ఎంతో శ్రేష్ఠమైనవని అందుకే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.డబ్బా పాలు వాడేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తల్లులకు, బాలింతలకు, గర్భవతులకు తల్లి పాల విశిష్టత గూర్చి అవగాహణ కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ తో పాటు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు స్రవంతి, ఆయా అంజలి మరియి తల్లులు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.
