పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
•ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్
న్యూస్ పవర్, 25 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయలు తక్షణమే విడుదల చేయాలని స్థానిక ఇల్లంతకుంట మండల తహసిల్దార్ పారుక్ కి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న 8300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు మెంబర్స్ మెంటు విడుదల చేయాలన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ లతో సంబంధం లేకుండా చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం అద్దె భవనాల్లో ఉంటూ విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అనేకమార్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వంపై అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులు అద్దె భవనంలో ఉంటూ సరేనా మౌలిక సదుపాయాలు లేక సతమతం అవుతున్నామన్నారు. విద్యా రంగ సమస్యల పరిష్కారం చూపకుండా ఉంటే ప్రభుత్వ ఎమ్మెల్యే లను నియోజకవర్గలలో ఎక్కడికి అక్కడ అడ్డుకుంటాం అని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. మరియు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని విద్యాహక్కు చట్టం ప్రకారం ఫీజుల కమిటీ ఏర్పాటు చేసి ఫీజు తీసుకోవాలని అన్నారు విద్య హక్కుచట్టాన్ని ఉల్లంఘించిన ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు పెండేల ఆదిత్య, డివైఎఫ్ఐ కార్యదర్శి పినకాషి నాగరాజు ఎస్ఎఫ్ఐ నాయకులు చిగుర్లు అనిల్, తుమ్మ అమన్, బట్టి హరికృష్ణ, దమ్మని సుమన్ తదితరులు పాల్గొన్నారు.
