మీరు చేసిన మోసాలు వసూళ్ల మీద నేను చర్చకు సిద్ధం నీవు సిద్ధమా ?
•మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి
న్యూస్ పవర్ ,25 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి సమావేశంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి మాట్లాడుతూ గురు వారం రోజున మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పైన అవాకులు చివాకులు పేల్చడమే కాక కమిషన్ల సత్యనారాయణ అని సంబోధించడం జరిగినది మిస్టర్ రసమయి బాలకిషన్ ఒకసారి గుర్తు పెట్టుకో కమిషన్ అంటే బ్రాండు అంబాసిడర్ రసమయి బాలకిషన్ దళిత బంధు పేరుమీద కమిషన్ వసూలు చేసింది మీరు కాదా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద కమిషన్ వసూలు చేసింది మీరు కాదా ఒకసారి గుర్తు చేసుకో రసమయి బాలకిషన్ , మీ అనుచరులు గాని చేసిన మోసాలు ఎన్ని అన్ని కావు ఒకసారి డాక్టర్ మీద మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచన చేసి మాట్లాడాలి మిస్టర్ రసమయి మీరు చేసిన అరాచకాలు మోసాలు వసూళ్ల మీద నేను చర్చకు సిద్ధం నీవు సిద్ధమా ప్లేసు టైము రోజు నువ్వే నిర్ణయించు ఎక్కడికి పిలిస్తే అక్కడికి నేను ఆధారాలతో సహా వస్తాను రసమయి బాలకిషన్ నీవు కూడా రావాలి నీ చర్చకు మా డాక్టర్ సాబ్ రావడమా నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉన్నది నీ సవాల్ కు నేను సిద్ధంగా ఉన్నా రసమయి బాలకిషన్ టైం చెప్పు మీరు మీ అనుచరులు ఎన్ని మోసాలు ఎన్ని కబ్జాలు ఎన్నో కమిషన్లు ఎక్కడెక్కడ తీసుకున్నారు రుజువు చేస్తాను
నేను సిద్ధం శవాల మీద పేలాలు ఏరుకునే గుణం మీది మిస్టర్ మాజీ ఎమ్మెల్యే ఇకముందు మా ఎమ్మెల్యే మీద మాట్లాడే ముందు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో నిన్ను నీ అనుచరులను నియోజకవర్గంలో ఎక్కడ తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకన్న మాజీ ప్యాక్స్ అధ్యక్షుడు ఐరెడ్డి మహేందర్రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్ డైరెక్టర్లు తాట్ల వీరేశం సురేందర్ రెడ్డి మచ్చ రాజేశం జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బడుగు లింగం మాజీ ఎంపీటీసీలు బట్టి చంద్రమౌళి మంద పెద్ద బాల్రెడ్డి,సోషల్ మీడియాకన్వీనర్ బెజ్జంకి శ్రీను,ఆంజనేయులు ఆంజనేయులు మచ్చ ప్రభాకర్ మచ్చ దాస్ ఎలుక అనిల్ కుమార్ సీనియర్ నాయకులు బాబు రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
