రైతుల దుస్థితి చూస్తే దయనీయంగా ఉంది
• మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
న్యూస్ పవర్ , 24 అక్టోబర్ , ఇల్లంతకుంట :
రైతుల దుస్థితి చూస్తే దయనీయంగా ఉందనీ
రైతు రుణమాఫీపై చర్చకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సిద్ధమని
మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ఇల్లంతకుంటలో మీడియా సమావేశం అన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎమ్మెల్యే కవ్వంపల్లి కి రైతుల సమస్యలపై సోయిలేదు
ఎమ్మెల్యే కు కమీషన్ల మీద ఉన్న సోయి...రైతులకు న్యాయం చేయడంలో లేదనీ అన్నాను
రైతు రుణమాఫీ ఏ ఊర్లో పూర్తి అయిందో ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా సవాల్ విసిరారు
ఎమ్మెల్యే కవ్వంపల్లి హడావిడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేస్తూ ఉన్నారు తప్ప..ఎక్కడ కూడా ఒక్క లారీ మిల్లుకు పోలేదన్నారు
అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కాలం.వెళ్లదీస్తుంది
అకాల వర్షాలతో రైతులు ఆగమయ్యారు.
రైతులు గంటకు 3500 పెట్టి చైన్ హార్వెస్టర్లతో వరి కొస్తున్నారు.
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రయివేట్ వ్యాపారులు అడ్డికి పావుసేరు ధాన్యం కొంటున్నారు.
ఎమ్మెల్యే కమీషన్ల నారాయణ ఏడాదిలో ఏ ఊరికి పోలేదు...ఎమ్మెల్యే ప్రారంభం చేసిన ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కూడా మిల్లులు అలాట్ మెంట్ కాలేదు.
కొనుగోలు కేంద్రాల్లో కనీసం గొనె సంచులు ఇవ్వలేదు
బీఆర్ఎస్ పార్టీ తరపున తాము నిజాలు చెప్పుతుంటే అబద్దాలు చెప్తున్నారని ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదం
రైతులకు ప్రభుత్వంపై నమ్మకం లేక... దిక్కులేక దళారులకు అమ్ముకుంటున్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను కొంటామని రైతులకు కనీసం ప్రభుత్వం భరోసా ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు కాలేదు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దమ్ము ఉంటే మిల్లులు అలాట్ మెంట్ చేయించనీ
అయ్యా కమీషన్ల నారాయణ ఇప్పటి వరకు ఏ గ్రామములో రైతు రుణమాఫీ పూర్తి అయిందో చర్చకు సిద్ధమా....నీ ఊరు అని చెప్పుకొనే పచ్చునూరులోనే చర్చకు సిద్ధమానీ అన్నారు
ఎన్నికల ముందు ధాన్యానికి 500 భోనస్ ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పుడు సన్న వడ్లకే భోనస్ ఇస్తామని చెప్పడం ఏమాత్రం న్యాయం ,
తెలంగాణ రైతులు దొడ్డు రకం వడ్లను సాగు చేస్తారు..సన్నాలు ఎకరాల కొద్దీ సాగు చేయరు
కొనుగోలు కేంద్రాల్లో గొనె సంచులు లేనప్పుడు.. ఎమ్మెల్యే వేసుకునే కండువాలో ధాన్యం జోకమంటారా అని అన్నారు.
ఎమ్మెల్యే కు కాంగ్రెస్ లీడర్లతో జోకించుకునుడు తప్ప...ధాన్యం జోకించే దానిపై సోయిలేదనీ అన్నారు
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి, కేవీఎన్ రెడ్డి, ఉడుతల వెంకన్న, గోపాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నాగరాజు, కేషవేని శ్రీనివాస్, దమ్మని మధు, రఘు, బోయిని రమేష్, మధు, రాజు, దేవయ్య, సత్యం, రాజు, తదితరులు పాల్గొన్నారు.
