JSON Variables

బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
 న్యూస్ పవర్, 19 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లె  గ్రామంలో
కాంగ్రేస్ ,బీజేపి పార్టీ నుండి   బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు కండువాలు కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆహ్వానించారు 
ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కాంగ్రేసోల్లు మాయమాటలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు వారి మాటలు నమ్మి మోసపోకండి అన్నారు.ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు కనిపించరని నాయకులు ఎన్నికలవేళ కనిపించి మాయమయ్యే నాయకులు కావాలా లేక అను నిత్యం మానకొండూర్ నియోజకవర్గంలో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే నేను కావాలా మీరే ఆలోచించుకోవాలన్నారు.నేను మీ ఆశీర్వాదం తో రెండు సార్లు గెలిచి మానకొండూర్ నియోజకవర్గాన్ని ఏంతొ అభివృద్ది చేసిన మరో సారి నన్ను ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలరని అన్నారు.
పదవి మీరు పెట్టిన బిక్షే అని మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా పని చేస్తాని అన్నారు.కాంగ్రెస్ పార్టీ హామీలకే పరిమితం అని దొంగ పథకాలతో సాధ్యం కాని హమీలతో ప్రజలను మోసం చేయడినికి గ్రామాలలో తిరుగుతున్నారని వారి మాయ మాటలు నమ్మద్దు అని అన్నారు.కాంగ్రేస్ ఇదే మాయ మాటలు సాద్యం కాని హామీలు నీటి మూటలు అయ్యాయని అన్నారు.నన్ను నమ్మి రెండు సార్లు నన్ను గెలిపించారని,మరో సారి నన్ను అశీర్వదిస్తే మానకొండూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని అన్నారు.కెసిఆర్ లేని తెలంగాణ ఊహించుకొలేమని అన్నారు. మనం తప్పు చేస్తే భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయని అన్నారు. పచ్చని తెలంగాణ లో చిచ్చు పెట్టి మన సంపద దోచుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మరోసారి కెసిఆర్ పాలన కోసం సిద్దంగా ఉన్నారని అన్నారు.45 రోజులు నా కోసం పనిచేస్తే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తానని అన్నారు. పదవులు ఎన్ని వచ్చినా తను మారే వ్యక్తిని కాదని, పార్టీ కార్యకర్తలే మా బలం మా ధైర్యం అని అన్నారు.

Post a Comment

0 Comments