JSON Variables

మాట తప్పిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్



మాట తప్పిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 

• సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముషం రమేష్
మనకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో హామీలు ఇచ్చి మరిచిపోయిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నీ వచ్చే ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ది చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూషం రమేష్  అన్నారు
ఈ సందర్భంగా ముషం రమేష్  మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, దళిత బందు ఇస్తామని దళిత నియోజకవర్గంలోని ప్రజలను మోసం చేసిండు అంటు రసమయి బాలకిషన్  విమర్శించారు. అలాగే మండల కేంద్రంలో దళితులలో రెండు వర్గలుగా విభజిస్తు పాలిస్తున్న రసమయి బాలకిషన్ కి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మండలంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తాం అని మాయ మాటలతో రెండవ సారి అసెంబ్లీకి వెళ్లిన ఏమి ప్రయోజనం లేదన్నారు. మండల కేంద్రంలో ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది యువత ఇసుక పనులకు వెళ్తున్నారు, కూలి పని చేస్తూ బ్రతుకుతున్నారు అన్నారు. పార్టీలో చేరితే గృహ లక్ష్మి, పార్టీ లో కొనసాగితే ప్రభుత్వ స్కీమ్ లు వర్తిస్తాయి అన్నట్లు వ్యవహరిస్తున్నారని యగ్దేవా చేశారు. ఎమ్మెల్యే కాక ముందు రసమయి ఆస్తులు ఎంత ఎప్పుడు ఎంత అని ప్రశ్నించారు. ఆస్తులు సంపాదించుకోవడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజల మీద లేదు అన్నారు. గతంలో హామీ ఇచ్చిన బ్రిడ్జ్, కల్వర్టు పన్నులు పూర్తి చెయ్యటంలో విఫలమయ్యారు అన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ (బి1, బి2) పార్టీలకు ఓటు వేసి ప్రజలు,కార్మికులు మోస పోవద్దుని అన్నారు. గతంలో రైతు చట్టాలకు బీజేపీ కి మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కటే అని తెలియజేశారు. ఇప్పుడు మద్యం మత్తులో దింపటానికి డబ్బు తో ఓట్లు కొనుకోవటానికి ప్రయత్నిస్తున్న పార్టీలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, ఎస్ఎఫ్ఐ  జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్, సిఐటియు  మండల కార్యదర్శి సావనపెల్లి రాములు, రైతు సంఘం మండల కార్యదర్శి నర్సిహ్మారెడ్డి, నరేష్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments