అంబేద్కర్ విగ్రహం ను ధ్వంసం చేసిన దుండగుడికి ఉరిశిక్ష అమలు చేయాలి
న్యూస్ పవర్ , 3 నవంబర్ , ఇల్లంతకుంట :
తెలంగాణ దళిత సంఘాల జె ఏ సి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జ్ సావనపెల్లి రాకేష్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...జోగులాంంబ గధ్వాల్ జిల్లా లోని ధరూర్ మండలం రేవులపల్లి గ్రామం లో మంగళవారం రోజున గ్రామ కూడలిలో ఉన్నటువంటి ప్రథమ ప్రపంచ మేధావి, నవ భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్.బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం పై అదే గ్రామానికి చెందిన వ్యక్తి రాడ్డు తో దాడి చేసి తలను చేతును పూర్తిగా ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ..అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడమంటే సర్వజనుల మనబోవాలు గాయపర్చినట్లేనని అన్నారు,సుమారు రెండు సంవత్సరాలు కస్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన,మహనీయులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ , రాజ్యాంగం గొప్పదనాన్ని గురించి జయంతి, వర్ధంతు ల సభ లో పాలకులు ప్రసంగాలు చేస్తున్నారు కానీ మహ నీయుల విగ్రహాలకు రక్షణ కల్పించడం లో విఫలమైతున్నారు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అహంకారం తో విగ్రహం ను ధ్వంసం చేసిన దుండగుడికి దేశ ద్రోహిగా కేసు నమోదు చేసి ఉరిశిక్ష అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించాలని కోరుతూ లేనియెడల దేశ వ్యాప్తంగా అంబేద్కర్ వారసులు ధర్నాలు, రాస్తారోకోలు తీవ్ర పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
