వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించిన జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు
న్యూస్ పవర్ , 6 నవంబర్ , ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని పోత్తూరు గ్రామంలో జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించినారు..
అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కును నునుగొండ బాలయ్య 11500 కి అందచేసిన సిద్ధం వేణు మాట్లాడుతూ పంటలను దళారులకు అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు
అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి,
ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి
అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు కాళేశ్వర జలాలతో ప్రతి ఎకరానికి నీటి అందించి ఉచిత కరెంటు ఇచ్చి సకాలంలో ఎరువులను_ అందించి రైతులకు అండగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం పై కక్షపూరితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవరిస్తుందని అన్నారు..
యాసంగి వడ్లను కొనుగోలు చేయకుండా మొండి వైఖరిని విడనాడి పంజాబ్ లో బీజేపీపాలిత రాష్ట్రంలో ఎలాగైతే వడ్లను కొంటున్నారో తెలంగాణాలో పండిన ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేయాలని బీజేపీప్రభుత్వనికి ఎంత మొరపెట్టుకున్న నిమ్మకు నీరెత్తినంటు ఉన్నది..దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు..
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి ఏఎంసి చైర్మన్ మామిడి సంజీవ్ ప్యాక్స్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి గ్రామ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ గారు ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్ ఉపసర్పంచి పరుశరాములు గౌడ్ డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతుబంధు అధ్యక్షులు సిద్ధం నరసయ్య, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కదురు శేఖర్ నాయకులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్నీ లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి
ఇంటి నిర్మాణం కోసం అన్ని రకాల వస్తవులు లభించును.
మీ బైక్ ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి
మి బిజినెస్ ఈ సైట్ లో ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవడానికి కాల్ చేయండి
సెల్ : 9490217612
