ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలి
• ఎస్సై సిరిసిల్ల అశోక్
న్యూస్ పవర్ , 7 డిసెంబర్, ఇల్లంతకుంట:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన పొత్తూరు గ్రామంలో ,గ్రామస్తులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న ఓటింగ్ ఉందని ,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ,ప్రజలందరూ కూడా అప్రమత్తతో, తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలని, ఎవరైనా అసాంఘిక శక్తులు బెదిరించిన, ప్రలోభాలకు గురిచేసిన, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎవరు కూడా హద్దులు దాటి ఎన్నిక నియమాలని ఉల్లంఘిస్తే ,వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటుగా హెడ్ కానిస్టేబుల్ కొమురయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
