విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు 'వీడీ ఫౌండేషన్' బాట.. కందికట్కూర్ లో కెరీర్ చార్ట్‌ల పంపిణీ
ఇల్లంతకుంట/కందికట్కూర్:విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దుకునేందుకు సరైన మార్గనిర్దేశం అవసరమని, ఆ దిశగా వీడీ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎంఈఓ శ్రీనివాస్ పేర్కొన్నారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు దండు వినోద్ స్థాపించిన వీడీ ఫౌండేషన్ (VD Foundation) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక 'కెరీర్ చార్ట్'లను ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు అందజేశారు.
బీసీ యువజన విభాగం మండల అధ్యక్షుడు భూమల్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈఓ శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు చార్ట్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 10వ తరగతి పూర్తి చేసిన అనంతరం నుంచి పీజీ స్థాయి వరకు అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, వాటిలో చేరేందుకు అవసరమైన అర్హతలు, ప్రవేశ విధానాలు తదితర అంశాలను ఈ చార్ట్‌లో క్షుణ్ణంగా వివరించారని తెలిపారు. ఇది విద్యార్థుల భవిష్యత్‌కు ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దొమ్మటి అజయ్, వార్డు మెంబర్ రాగెల్ల అనిల్, బీసీ గ్రామ అధ్యక్షుడు జంగిటి అజయ్, నాయకులు కనకరావు, అనిల్, రాములు తదితరులు పాల్గొన్నారు.
