గొర్రెల ఆరోగ్యమే పెంపక దారుల సంపద
• కంది కట్కూర్ గ్రామంలోగొర్రెలకు నట్టల మందు పంపిణీ
న్యూస్ పవర్, 27 డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం లోని కందికట్కూర్ గ్రామంలో శనివారం గొల్ల, కురుమ గొర్రెల పెంపకదారులకు చెందిన గొర్లకు నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతలపెల్లి విజయమ్మ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు రావు ముఖ్య అతిథులుగా పాల్గొని గొర్లకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొర్రెల ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే పెంపకదారుల జీవన భద్రత బలపడుతుందని పేర్కొన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు నివారణ చర్యలు ఎంతో అవసరమని, ఇటువంటి కార్యక్రమాలు పెంపక దారులకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి పూర్ణ చంద్రిక, ఉప సర్పంచ్ దొమ్మటి అజయ్ వార్డు సభ్యులు రాగళ్ల శ్రీనివాస్ భూమల్ల ప్రశాంత్ చదవాల శ్రీధర్ దొమ్మటి శ్రీనివాస్ రాగళ్ల అనిల్ న్యాత అశోక్ ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల కాపగదారులు నక్క వెంటికి భూమల్ల పోచయ్య ఎగుల్ల బాలయ్య మల్లేష్ తూటి పరశురాములు నక్క పరశురాములు మల్లేశం తదితరులు పాల్గొన్నారు
