అర్హుల గుర్తింపు సర్వే పకడ్బందీగా చేయాలి



అర్హుల గుర్తింపు సర్వే పకడ్బందీగా చేయాలి


• పొరపాట్లు జరగకుండా బాధ్యతాయుతంగా నిర్వహించాలి
• కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
• ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో సర్వే ఆకస్మిక తనిఖీ


న్యూస్ పవర్ , 17 జనవరి , ఇల్లంతకుంట :
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న పథకాలకు అర్హుల గుర్తింపు కోసం సర్వేను పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాటు జంగారెడ్డి పల్లె, అనంతారంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు.
 ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు స్వయంగా వెళ్లి పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు భరోసా పథకం పంపిణీ కోసం కొనసాగుతున్న సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు, నూతన రేషన్ కార్డుల జారీ చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ, ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆయా పథకాలు సంబంధించి గ్రామాల్లో సర్వేను పొరపాట్లు జరగకుండా బాధ్యతాయుతంగా పకడ్బందీగా చేయాలని అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పి హెచ్ సి ని కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. నూతన దవాఖాన నిర్మించే దాకా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలను స్థానిక పల్లె దవాఖానలో అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత,
ఎంపీడీఓ శశి కళ, తహసిల్దార్ ఫరూఖీద్దీన్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments