రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
న్యూస్ పవర్ , 6 నవంబర్ , ఇల్లంతకుంట :
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ అన్నారు.. ఆదివారం ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో మరియు నారెడ్డిపల్లె లో ప్యాక్స్ గాలిపెల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్.. ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో మాత్రమే రైతులకు రైతుబందు , రైతు భీమా పథకాలను తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తుంది అని అన్నారు.
రైతుల సౌకర్యం కోసమే ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే అమ్మాలని సూచించారు.. దళారులకు విక్రయించి రైతులు నష్ట పోవద్దని అన్నారు..
ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని , కేంద్రాల్లో రైతులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ , డైరెక్టర్లు గడ్డమీది నాగలక్ష్మి , కోరేపు నారాయణ రెడ్డి , ప్యాక్స్ సీఈఓ మల్లేశం , రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ కొమ్ముల భూపతి రెడ్డి , సెంటర్ నిర్వాహకులు రాజిరెడ్డి , హమాలి సంఘం నాయకులు , రైతులు తదితరులు పాల్గొన్నారు.
