పెద్దలింగపూర్ వడ్ల కొనుగోలు సెంటర్ వద్ద రైతులతో మద్దతుగా రాస్తా రోకా చేసిన బీజేపీ నాయకులు
న్యూస్ పవర్, 3 నవంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోనీ గ్రామాలలో వడ్ల కొనుగోలు 24 గంటలలో ప్రారంభించాలని పెద్దలింగపూర్ సెంటర్ వద్ద రైతులతో మద్దతుగా రాస్తా రోకా చేసిన బీజేపీ నాయకులు,
రైతులు వడ్లు పోసి నెల రోజులైనా కంటలు వేయకుండా కాలయాపన చేస్తూన్నా తెరాస ప్రభుత్వం తీరుపై రైతులతో కలిసి రాస్తా రోకా చేస్తు బెంద్రం.తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడతూ. రైతులు కష్టపడి పండించిన వడ్లు కొనుగోలు కేంద్రాలలో పోసి నెల రోజులైనా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మునుగోడు నియోజకవర్గనికి విహార యాత్రకు వెళ్ళితే అధికారులేమో మీరు వచ్చే దాకా వడ్లు కంటలు వేయకపోవడంతో రైతులు దిక్కులేక దళారీలకు ప్రైవేట్ వ్యక్తులకు క్వింటాలుకు 1560 రూపాయలకే అమ్ముకుంటు క్వింటాలకి 500 చొప్పున ఎకరానికి 13000 నష్టపోతు కన్నీళ్లు పెడ్తున్న కనికరం లేని తెరాస ప్రభుత్వన్ని ఏమనాలి! రాష్టంలో రైతులు ఇబ్బందులు పడుతు మళ్ళీ వర్షానికి వడ్లు తడుస్తాయో అనే భయందోళన చెందుతుంటే ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గలాని విడిచి మునుగోడు వెళ్లితే ఇక్కడ రైతులు బాధలు ఎవరికీ చెప్పాలి,మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ప్రచారాలపై ఉన్నా శ్రద్ద మీ నియోజకవర్గ సమస్యల పట్ల లేకపోవడం సిగ్గుచేటున్నారు,రైతులు దిగులు పడ్తున్న పట్టించుకోకుండా మీరు వచ్చి ఫోటోలు దిగేదాకా వడ్లు కంటలు స్టార్ట్ చేయడంలేదు, రైతులు భూములు కౌలుకు తీసుకొని అప్పులు చేసి పంటలు వేసి వడ్లు కొనకపోవడంతో రైతున్నాలు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నదాన్నారు, రేపు 24 గంటలలో మండలంలోని అన్నీ సెంటర్లలో వడ్లు తూకం వేస్తామని మండల ఎస్ ఐ వచ్చి తహసీల్దార్ తో, PACCS CEO తో హామీ ఇప్పించటంతో పెద్దలింగపూర్ గ్రామ వడ్ల సెంటర్ వద్ద రాస్తా రోకా నిరసన కార్యక్రమన్ని విరమించిన రైతులు బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమంలో బత్తిని.స్వామి, గజ్జల.శ్రీనివాస్, చెప్పాల. గంగాధర్, దండవేణి.రజినీకాంత్, బండారి.రాజు, వజ్జపెల్లి. శ్రీకాంత్, అంతటి.వేణు, సుదగోని.శ్రీకాంత్, కేశవేణి. భూమేష్, సుదగోని.రాజు, దాచారం.తిరుపతి, పయ్యావుల బాలయ్య ,కీర్తి రాజు, DR. విజయ్,పయ్యావుల నవీన్, కొమ్ముల వెంకటేశ్, కొమ్ముల నరేష్, నలగొండ కృష్ణ, దరిపెల్లి హరీష్, అరుకుటి.భాను, అరుకుటి.అనిల్, కముటం.ఎల్లయ్య, అమ్ముల.ఉదయ్, మమిడ్ల అనిల్, పయ్యావుల.శ్రీనివాస్, పసుల.దుర్గయ్య, కొమురయ్య, సలాంత్రి.శీను, పెంటయ్య, చొప్పరి.వంశీ, జెట్టి కనుకయ్య తదితరులు పాలుగోన్నారు.