వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించిన ఇంఛార్జి ఛైర్మన్ గొడుగు తిరుపతి
న్యూస్ పవర్, 7 నవంబర్ , ఇల్లంతకుంట :
ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రహీంఖాన్ పేట వెల్జిపూర్ ఓబులాపూర్ వల్లంపట్ల కిష్ణారావు పల్లె కందికట్కూరు గ్రామాల పరిధిలో వడ్ల కొనుగోలు సెంటర్లు ఇంఛార్జి ఛైర్మన్ గొడుగు తిరుపతి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు , ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి ,వ్యవసాయ మార్కెట్ చేర్మన్ మామిడి సంజివ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ గారు, సి ఈ ఓ చిట్టి రవిందర్ రెడ్డిఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు, ఏ ఏం సి డైరెక్టర్లు, రైతులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మీ బిజినెస్ ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవడానికి కాల్ చేయండి సెల్ : 9490217612
