తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చిన టీఆర్ ఎస్ పార్టీదే గెలుపు
న్యూస్ పవర్, 7 నవంబర్ , ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తన కార్యాలంయంలో రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు పత్రికా మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చిన టీఆర్ ఎస్ పార్టీదే గెలుపు అని అన్నారు.యావత్ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుందని మునుగోడు విజయంతో మరోసారి రుజువైందని అన్నారు. శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ ని రాజీనామ చేయండి అని బిజేపి వాళ్ళు ఫోన్ చేయడం సిగ్గు చేటు అని ముందుగా మీ ఎంపీ బండి సంజయ్ ని రాజీనామ చేయండి ..అరవై సంవత్సారాల నుండి జరగని అభివృద్ది నేడు రసమయి సారథ్యంలో మానకొండూర్ నియోజకవర్గం అభివృద్ది చెందిదని అన్నారు..బండి సంజయ్ ఎంపీ గెలిచినాక తన నిధుల నుండి జిల్లాలోని ఎన్ని మండలాలకు ఎన్ని నిధులు కెటాయించుండో బిజేపి వాల్లు చెప్పాలని అన్నారు..మీ బండి సంజయ్ గ్రామాలలో తిరుగకుండా నిధులు ఇవ్వకుండా డిల్లీ మకాం పెట్టి గుజరాతీలతో దోస్తాన్ చేస్తుండన్నారు.అని నిత్యం ప్రజలతోనే ఉండి గ్రామ గ్రామన తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే రసమయి నీ విమర్శిస్తే సహించేది లేదు అన్నారు... అలాగే మానకొండూర్ శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ సారథ్యం చండూర్ మండలంలో టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరెడ్డి ని గెలిపించాలని ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడం ద్వార చండూర్ మండలంలోనే మా శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ ఇంచార్జ్ గ ఉన్న గ్రామాలు దోనిపాముల,తిమ్మారెడ్డి గూడెం,జోగి గూడెం గ్రామాలలో టీఆర్ ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాదించిదని మునుగోడులో ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని అందలం ఎక్కించారని ప్రత్యర్థి పార్టీపై టీఆర్ఎస్ ధర్మ పోరాటం చేసి విజయదుందుభి మోగించిందని అన్నారు. సీఎం కేసీఆర్ భరోసాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ముందుగా ఊహించిందేనని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అహంకారం ఓడి ,మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం గెలిచిందని అన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో, నియంతృత్వంతో వ్యవహరించినా టీఆర్ఎస్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. టీఆర్ఎస్ కు పట్టం కట్టిన మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
మీ బిజినెస్ ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవడానికి కాల్ చేయండి సెల్:9490217612
