వ్యవసాయదారులు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
న్యూస్ పవర్, 7 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం గ్రామంలో గ్రామసభ సర్పంచ్ గొడిసెల జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.2023-2024ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధిహామీ పథకం యొక్క ఆవశ్యకతను ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్ కొల్లూరి మహేశ్ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.ఇట్టి ఉపాధిహామీలో భాగంగా గ్రామ రైతులకు వ్యవసాయ క్షేత్రంలో భూమి హెచ్చుతగ్గుల వివరాలు నమోదు చేసుకొని చదును చేసుకోవడానికి మరియు పశువుల షెడ్డు నిర్మాణం,గొర్రెల షెడ్డు నిర్మాణం కోసం రైతులు పేరు నమోదు చేసుకొని నిర్మించుకోవడానికి ఉపాధిహామీ నుండి సబ్సిడీ ఇస్తుందని ఆయన తెలిపారు.జాబ్ కార్డ్ ఉన్నవాళ్లు అందరూ ఉపాధి హామీ లో నమోదు చేసుకున్న వాళ్ళు ఉపయోగించుకోవాలి,చెక్ డ్యాంల నిర్మాణం,ఆయిల్ ఫామ్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడానికి ఉపాధిహామీలో పొందుపరచడం జరిగినది.కానీ రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రంజీత్,ఉపసర్పంచ్ కుమార్,వార్డు సభ్యులు,అంగన్వాడీ కార్యకర్తలు,ఆశా కార్యకర్త,గ్రామస్తులు పాల్గొన్నారు.
మి బిజినెస్ ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవడానికి కాల్ చేయండి 9490217612

