నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
న్యూస్ పవర్ , 7 నవంబర్ , ఇల్లంతకుంట :
తెలంగాణ దళిత సంఘాల JAC రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జ్ సావనపెల్లి రాకేష్...విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచం లోనె అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన మహనేయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ,రాబోయే సీతాకాల పార్లమెంట్ సమావేశంలో తీర్మానం చేశి,భారత నూతన పార్లమెంట్ భవనానికి ప్రథమ ప్రపంచ మేధావి నవ భారత రాజ్యాంగ నిర్మాత,డాక్టర్.బి. ఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవనము పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..లేనియెడల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ MP బండి సంజయ్ ని ఎమ్మెల్యే లను నాయకులను తెలంగాణ రాష్ట్రం లో ఎక్కడ తిరిగిన దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకొని ధర్నాలు రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు..
