రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-ఎంపీపీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి
న్యూస్ పవర్ , 8 నవంబర్ , ఇల్లంతకుంట :
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాటు పడే ప్రభుత్వమని ఎంపీపీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి అన్నారు, ఈ రోజు గొల్లపల్లి గ్రామంలో డి సి ఏం ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నా వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని రసమయి బాలకిషన్ మనకొండూర్ శాసన సభ్యులు ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ తో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్మవద్దని రైతులకు సెంటర్ వారు ఇచ్చిన టోకెన్లు వారిగా రైతులు తమ ధాన్యాన్ని విక్రయించడానికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కడగండ్ల తిరుపతి,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు పత్రి అంజయ్య, మాజి గ్రామ శాఖ అధ్యక్షుడు సొల్లు శేఖర్, హమ్మలి సంఘం అధ్యక్షుడు ఒరుపుల రాములు,రైతుల మల్లయ్య,అనిల్, రాజు, ఎల్లయ్య, మల్లేశం, శంకర్,పోచయ్య సెంటర్ ఇంచార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
