టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
న్యూస్ పవర్ , 8 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మ దిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది ….
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి మాట్లాడుతూ ఎన్ని ఓటములు వచ్చినా మాట తప్పని మడమ తిప్పని నాయకుడు , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నింటినీ ఎదుర్కొని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ని ఇటు రాష్ట్రంలో , అటు కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి సారిధ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కార్యోన్ముఖులై పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు అంతగిరి వినయ్ ఎర్రోజు సంతోష్ కుమార్ , ఎండి జమాల్ , ఉపాధ్యక్షుడు గూడ నరేందర్ రెడ్డి , సురేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి చిక్కుడు సత్యం అధ్యక్షులు , గ్రామ శాఖ , ఎండి హైదర్ సమీర్ వెంకటేష్ కోటేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మచ్చ రాజేశం యూత్ కాంగ్రెస్ నాయకులు , మైనారిటీ ఎండి జమాల్ నాయకుల తదితరులు పాల్గొన్నారు.