చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
న్యూస్ పవర్ , 8 నవంబర్ , ఇల్లంతకుంట:
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో షెడ్యూల్దు కులాలు మరియు తెగలకు సంబందించిన అట్రాసిటీ చట్టాల పైన సామాన్య ప్రజలకు అవగాహన కల్పించుటకు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ , స్వచ్ఛంద సంస్థ రూపొందించిన కరపత్రం ను అడిషనల్ SP చంద్రయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి అని అన్నారు.
షెడ్యూల్దు కులాలు, తెగలకు సంబంధించిన అట్రాసిటీ చట్టాలు బలంగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి చట్టాలను సరైన న్యాయం కోసం మాత్రమే ఉపయోగించాలని కోరారు.
ఈ సందర్భంగా వారు స్పందిస్తూ కులాల మధ్య అంతరాలు తగ్గి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది చదువు ఒక్కటే నని అన్నారు.
బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి ఆశయము కూడా అదేనని, దళితులు హక్కులతో పాటుగా చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
స్వచ్ఛంద సంస్థలు అణగారిన వర్గాలలో చదువు యొక్క ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.
ప్రజలలో పౌర హక్కుల పట్ల అవగాహన పెంచేందుకు ప్రతి నెల 30 వ తేదీన పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి మండలములో నిర్వహింహడం జరుగుతుందని తెలిపారు.
0 Comments