పోత్గల్ లో ఉచిత వైద్య శిభిరం
న్యూస్ పవర్ రిపోర్టర్ దిలీప్
కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ముస్త్తాబాద్ మడలం పోత్గల్ గ్రామం లో ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. వైద్య శిభిరాన్ని సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు గారు ప్రారంభించి మాట్లాడుతు. పేద ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందించడంతో పాటు బీపీ, షుగర్, ఈసీజీ, పరీక్షలు చేయడం అభినందనీయమన్నారు. వైద్య శిభిరంలో సుమారు 120 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్బంగా మెడికవర్ అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ,24 గంటల పాటు వైద్య సేవలందిస్తున్న ఏకైక ఆసుపత్రి మెడికవర్ అని తెలిపారు. ఆరోగ్యశ్రీతో పాటు అన్ని రకాల హెల్త్‌కార్డులు ఆసుపత్రిలో చెల్లుబాటు అవుతాయని అన్నారు. ఈ వైద్య శిభిరంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అరవింద్, పోతుగల్ ప్రాథమిక ఆసుపత్రి డాక్టర్ సంజీవరెడ్డి, నరేందర్, ఉప సర్పంచ్ మంజుల రమేష్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
=====
