నూతన మహిళా సంఘ భవనానికి భూమి పూజ
న్యూస్ పవర్ , 8 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
అనంతగిరి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం మంజూరైన నూతన భవన నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ అరుకాల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లంతకుంట ఏఎంసీ (AMC) చైర్మన్ ఐరెడ్డి చైతన్య-మహేందర్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ఈ భవనాన్ని మంజూరు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతగిరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
