పెద్దలింగాపూర్లో ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్
• క్రీడాకారులకు జెర్సీలు అందజేసి, టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించిన కేతిరెడ్డి నవీన్ రెడ్డి
న్యూస్ పవర్ , 8 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, పెద్దలింగాపూర్ గ్రామంలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా సాగింది. ఈ పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పెద్దలింగాపూర్ మరియు పుల్లూరు జట్లు తలపడ్డాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేతిరెడ్డి నవీన్ రెడ్డి ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారికి జెర్సీలను (Jerserys) అందజేశారు. అనంతరం టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ను లాంఛనంగా ప్రారంభించారు. క్రీడలు యువతలో స్నేహభావాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తమకు సహకారం అందించి, స్వయంగా విచ్చేసి ప్రోత్సహించినందుకు కేతిరెడ్డి నవీన్ రెడ్డి కి గ్రామ యువకులు, క్రికెట్ క్రీడాకారులు మరియు నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
