ముస్కాన్ పేటలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ
• గ్రామ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం: సర్పంచ్ భాస్కర్ రెడ్డి
న్యూస్ పవర్, 8 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో, ఇల్లంతకుంట మండలం ముస్కాన్ పేట గ్రామంలో ఈజీఎస్ (EGS) నిధులు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మహిళా సంఘ భవనానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, మహిళా సంక్షేమం మరియు పేదల గృహావసరాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకువెళతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లావణ్య, వార్డ్ సభ్యులు, సీసీ వెంకటేశం , సి ఏ లు రాజు పుష్పలత మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
